Wednesday , November 22 2017

రూటు మార్చిన హరీష్ శంకర్!!!!

రూటు మార్చిన హరీష్ శంకర్!!!!

దర్శకుడు హరీష్ శంకర్  గబ్బర్ సింగ్ సినిమా తో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. గబ్బర్ సింగ్ సినిమా ఎంత  పెద్దటి విజయం సాదిన్చిందో మనకు తెలిసిందే. ఆ తర్వత హరీష్ శంకర్  దర్శకత్వంలో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  బోల్తా కొట్టింది.  ఇలా  విజయాలు అపజయాల తర్వాత జూలై 23  న దువ్వాడ జగన్నాధం ఎన్నో అంచనాల నడుమ విడుదల  అయ్యి   ఆవరేజ్  టాక్ సొంతం చేసుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించింది. దువ్వాడ జగన్నాధం సినిమా నిర్మాతల కు మంచి  లాభాలనే మిగిల్చింది. దువ్వాడ జగన్నాదం తర్వాత హరీష్ శంకర్ ఎటువంటి  సినిమా తో వస్తాడో అని అందరిలో ఆసక్తి రేకొంది.

రూటు మార్చిన హరీష్ శంకర్!!!!

ప్రస్తుతం హరీష్ శంకర్ ప్రేమ కథతో సినిమా చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో గుస గుసలు. అది నిజమే, హరీష్ శంకర్  ఒక ప్రేమ కథ తో సినిమా చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో రెండు ప్రేమ కథలు ఉంటాయట. ముందుగ ఈ సినిమా మెగా హీరోల తో మల్టి స్టారర్ గ తెరకెక్కించాలని సిద్దం చేసాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కథ చెప్పడం లోనే  ఆగి పోయింది. వరుస విజయాల తో ఊపుమీదున్న నాచురల్ స్టార్ నాని మరియు శర్వానంద్ తో చేయాలనీ అనుకున్నారు. నాని తన mlc సినిమా తో బిజీ గ, శర్వానంద్ తన కొత్త సినిమా తో బిజీ గ ఉండటం వల్ల వారు ఈ కథ కి ఒప్పుకోలేదు.

ఇప్పుడు హరీష్ శంకర్ కొత్త తారాగణం తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ విధంగా హరీష్ శంకర్ కొత్త నటీనటుల కోసం వేట మొదలు పెట్టాడు. దీనికి దాగుడు మూతలు అని టైటిల్ పెట్టారు. హరీష్ శంకర్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా కి ఆయనే నిర్మాత మరియు సహ నిర్మాత గ దిల్ రాజు గారు వ్యవహరించనున్నారు. మరి ఈ కథ  ఎంత వరకు  వెల్లనుందో వేచి చూద్దాం.

Check Also

Srikanth is changed as a villain for Balakrishna 102 Movie

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు అందులో హీరోయిజం ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ …

Leave a Reply