Wednesday , November 22 2017

అందగాడు మూవీ రివ్యూ

 

చిత్రం             :  అంధగాడు
నటీనటులు      :  రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, ఆశిష్‌ విద్యార్థి, షియాజీ షిండే, సత్య, రాజా రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు.
సంగీతం          :  శేఖర్‌ చంద్ర
నిర్మాణ సంస్థ    :   ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌
ఛాయాగ్రహణం   :  బి.రాజశేఖర్‌
కళ,కూర్పు      :   కృష్ణమాయ, ఎం.ఆర్‌.వర్మ
నిర్మాత          :   రామబ్రహ్మం సుంకర
కథ, మాటలు, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్‌
ఇపుడున్న యువ కథానాయకుల్లో రాజ్‌తరుణ్‌ తనకు తగిన విధంగా కొత్త కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకెళ్తున్నాడు. రాజ్‌తరుణ్‌ గుడ్డివాడిగా నటించిన ఈ చిత్రం లో హెబ్బాహ్ పటేల్ అతని సరసన వరుసగా మూడోసారి జోడికట్టింది. అలాగే రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం కూడా ఇదే. మరి అంధగాడుగా రాజ్‌తరుణ్‌ ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాల్సిందే మరి .

అందగాడు మూవీ రివ్యూ :

కథ:
గౌతమ్‌(రాజ్‌తరుణ్‌) శారదాదేవి అనే అంధ ఆశ్రమంలో తన స్నేహితులు రాజు, కిరణ్‌, దివ్యలతో కలిసి పెరుగుతుంటాడు. తన కళ్ళ కోసం కంటి ఆసుపత్రులు చుట్టూ తిరుగే గౌతమ్‌కు ఓ సందర్భంలో అసిస్టెంట్‌ కమీషనర్‌ ధర్మ(షాయాజీ షిండే) కూతురు నేత్ర(హెబ్బా పటేల్‌) పరిచయం అవుతుంది. తను గుడ్డివాడినని తెలిస్తే నేత్ర తనను విడిచి పెట్టేస్తుందని భావించిన గౌతమ్‌, తన స్నేహితుడు(సత్య) సహాయంతో నేత్ర దగ్గర కళ్ళు ఉన్నవాడిలా నటిస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో నేత్రకు నిజం తెలిసిపోతుంది. తనకు అబద్ధం చెప్పినందుకు గౌతమ్‌ను విడిచి పెట్టి వెళ్ళిపోతుంది. అయితే నేత్ర కంటి వైద్యురాలు కావడంతో ఓ యాక్సిడెంట్‌ కేసులో వచ్చిన కళ్ళను గౌతమ్‌కు పెట్టేలా ఏర్పాటు చేస్తుంది. కంటిచూపు వచ్చిన గౌతమ్‌, నేత్రను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తనే నేత్ర అని చెప్పకుండా మూగ అమ్మాయిలా నటిస్తుంది నేత్ర. అయితే గౌతమ్‌కు కూడా నేత్ర నటిస్తుందనే అసలు నిజం తెలుస్తుంది. కానీ నేత్ర వల్లే తనకు కళ్ళు వచ్చాయని, నేత్ర కూడా తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న గౌతమ్‌ ఆమెను ప్రేమిస్తాడు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. గౌతమ్‌కు ఓ కారు నెంబర్‌ పదే పదే కలలో కనపడుతూ ఉంటుంది. అదే సమయంలో కులకర్ణి(రాజేంద్రప్రసాద్‌) కారణంగా పేరు మోసిన రౌడీ బాబ్జీ(రాజా రవీందర్‌) మనుషులను చంపి మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. అసలు కులకర్ణి ఎవరు? కులకర్ణి బాజ్జీ మనుషులను ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు గౌతమ్‌కు, బాజ్జీకి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

చివరగా : అంధగాడు..మెప్పిస్తాడు
రేటింగ్‌   : 2.75/5

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply