Wednesday , November 22 2017

‘దువ్వాడ జగన్నాథం’ మూవీ రివ్యూ

చిత్రం : ‘దువ్వాడ జగన్నాథం’
నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, మురళీ శర్మ, సుబ్బరాజు , పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, వెన్నెల కిషోర్, శశాంక్ తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం : అయానంక బోస్
స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, దీపక్ రాజు
నిర్మాత : దిల్ రాజు
కథ, మాటలు & దర్శకత్వం : హరీష్ శంకర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్ మరియు నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం డీజే అలియాస్ ‘దువ్వాడ జగన్నాథం’. మొదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజే విడుదలయ్యింది. మరి ప్రేక్షకుల అంచనాల్ని ఎంత మేరకు అందుకుందో చూద్దాం పదండి.

‘దువ్వాడ జగన్నాథం’ మూవీ రివ్యూ :

కథ :

చిన్నప్పటి నుంచే అన్యాయం అంటే సహించని బ్రాహ్మణ కుర్రాడు డీజే (అల్లు అర్జున్) అలియాస్ దువ్వాడ జగన్నాథం, ఒకవైపు తండ్రితో కలిసి క్యాటరింగ్ నడుపుతూ మరోవైపు ఒక పోలీస్ అధికారి సహకారంతో అక్రమార్కుల భరతం పడుతుంటాడు. కానీ తన ఐడెంటిటీ తెలియకుండా పనులు చక్కబెడుతున్న డీజే కు అదే సమయంలో ఒక భారీ కుంభకోణం బయటికి వస్తుంది. దాని వల్ల తన ఆత్మీయుడు చనిపోవడంతో డీజే రంగంలోకి దిగుతాడు. ఈ కుంభకోణం వెనుక ఉన్న రొయ్యల నాయుడు (రావు రమేష్) డీజే మీద దృష్టిసారిస్తాడు. తన డొంక కదిలిస్తున్న డీజే గుట్టు మొత్తం తెలుసుకుని అతడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు రొయ్యల నాయుడు. మరి డీజే అతణ్ని ఎలా ఎదుర్కొన్నాడు తన మిషన్ ఎలా కొనసాగించాడు ఈ కుంభకోణం వల్ల బాధితులైన కుటుంబాల్ని డీజే ఎలా ఆదుకున్నాడు అన్నది మిగతా కథ.

చివరగా : డీజే .. బలే బోరు కోటిస్తాడు.

రేటింగ్ : 2.25/5

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply