Wednesday , November 22 2017

‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ మూవీ రివ్యూ

చిత్రం : ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’
నటీనటులు : సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాతోడ్, మానస, కృష్ణభగవాన్, వంశీ నక్కంటి తదితరులు
సంగీతం : మణిశర్మ
ఛాయాగ్రహణం : నగేష్ బానెల్
నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం : వంశీ

‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’ మూవీ రివ్యూ :

కథ:

లేడీస్ టైలర్ గా గొప్ప పేరు సంపాదించిన సుందరం కొడుకు గోపాళం (సుమంత్ అశ్విన్) తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కుట్టు మిషన్ నే నమ్ముకుంటాడు. ఐతే తండ్రిలా పల్లెటూరికి పరిమితం అయిపోకుండా టౌన్లో షాప్ పెట్టుకుని ‘ఫ్యాషన్ డిజైనర్’గా పేరు సంపాదించేయాలని అతడికి ఆశ. ఐతే అందుకు కావాల్సిన పెట్టుబడి లేకపోవడంతో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని తన కోరిక నెరవేర్చుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా గేదెల రాణి (మానస)ను ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఆమె కంటే ఎక్కువ ఆస్తి ఉందని అమ్ములు (మనాలి)పై కన్నేస్తాడు. ఆపై తనకంటే ఎక్కువ ధనవంతురాలైన మహాలక్ష్మి (అనీషా)పై అతడి దృష్టి మళ్లుతుంది. మరి ఈ ముగ్గురితో సాగించిన ప్రేమ లీలల వల్ల గోపాళం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అలాగే చివరికి అతడి జీవితం ఎవరితో ముడిపడింది? తన కోరిక నెరవేరిందా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.

చివరగా : ఫ్యాషన్ డిజైనర్ …. మాత్రం తండ్రికి తగని టైలర్.

రేటింగ్ : 2/5

 

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply