Wednesday , November 22 2017

మరకతమణి మూవీ రివ్యూ

చిత్రం : ‘మరకతమణి’
నటీనటులు : ఆది పినిశెట్టి, నిక్కీ గర్లాని, మునీష్ కాంత్ రామ్ దాస్, డానియల్, బ్రహ్మానందం, ఆనంద్ రాజ్, ఎం.ఎస్.భాస్కర్ తదితరులు
సంగీతం : ధిబు నినన్ థామస్
ఛాయాగ్రహణం : పి.విశేఖర్
నిర్మాణం : శ్రీ చక్ర ఇన్నోవేషన్స్-రుషి మీడియా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఏ.ఆర్కే శరవణన్

ఆది పినిశెట్టి హీరోగా తెలుగులో నిలదొక్కుకోలేకపోయినప్పటికీ తమిళంలో మంచి గుర్తింపే సంపాదించాడు. వైశాలి, మలుపు లాంటి డబ్బింగ్ సినిమాలు ఇక్కడ బాగానే ఆడాయి. ఇప్పుడతను ‘మరకతమణి’తో ఇప్పుడు పలకరించాడు. కొత్త దర్శకుడు ఏఆర్కే శరవణనన్ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ ముచ్చట్లేంటో చూద్దాం పదండి.

మరకతమణి మూవీ రివ్యూ :

కథ:

అత్యంత విలువైన మరకతమణి కోసం వెళ్లి దాన్ని ముట్టుకున్న వాళ్లందరూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్లు తెలిసిన తర్వాత ఎవరూ దాని జోలికి వెళ్లడానికి భయపడుతున్న సమయంలో ఒక చైనీయుడు అది తెచ్చిస్తే రూ.10 కోట్లు ఇస్తానని ఆశ చూపిస్తాడు. కానీ ఎవ్వరూ ముందుకు రారు. ఐతే చిన్న చిన్న స్మగ్లింగ్ డీల్స్ అవీ చేస్తూ అప్పుల వాళ్ల బాధలు తప్పించుకోవడానికి ఏదైనా పెద్ద డీల్ చేయాలని చూస్తున్న రఘు (ఆది) తన ఫ్రెండుతో కలిసి మరకతమణిని తేవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అక్కడి నుంచే అతడికి ఇబ్బందులు మొదలవుతాయి. అతను దయ్యాలతో సహవాసం చెయ్యాల్సి వస్తుంది. వాటి సాయంతోనే మరకతమణిని తీసుకురావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి అతను మరకతమణిని తెచ్చాడా దయ్యాలు అతడికి ఏ విధంగా సాయపడ్డాయి, ఇంతకీ ఆ మరకతమణి గుట్టేంటి అన్నది మిగతా కథ.

చివరగా : ‘మరకత’ లో మెరుపులే లేవు

రేటింగ్ : 2.25/5

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply