Wednesday , November 22 2017

డబ్బులు కోసం చేయట్లేదు అంటున్న జూ.ఎన్టీఆర్

తెలుగు టీవీలో ఇంతకు ముందెన్నడూ లేని భారీ షోకు రంగం సిద్ధమైంది. హిందీ ఇంగ్లిష్ లో బాగా పాపులరైన బిగ్ బాస్ ప్రోగ్రాం మొదటిసారిగా తెలుగులో చేయబోతున్నారు. అయితే తెలుగులో జూ. ఎన్టీఆర్ హోస్టుగా చేస్తున్న ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు 60 కెమెరాల మధ్య 70 రోజుల పాటు ఒకే ఇంటిలో కలిసి ఉండటమే ఈ షో అసలు కాన్సెప్ట్. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే మా టీవీలో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 16 నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది.

Nandamuri Bala Krishna can only do NTR role in NTR biopic says Jr.NTR

డబ్బులు కోసం చేయట్లేదు అంటున్న జూ.ఎన్టీఆర్ :

ఈ సందర్బంగా జూ. ఎన్టీఆర్ ఈ షో కు సంబంధించి మీడియాతో మాట్లాడుతూ ‘‘బిగ్ బాస్ లో 12 మంది సెలబ్రిటీలు ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే వారెవరో నాకూ తెలియదు. ఆ 12 మంది ఎవరని నేనూ మా టీవీ వాళ్లను అడుగుతున్నా. పక్కవాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ షోకు ఇంత పాపులారిటీ రావడానికి అదే కారణం. ఈ షో కచ్చితంగా తెలుగు వాళ్లను ఆకట్టుకుంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్ల తీరుతెన్నులకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం తయారవుతోంది. శని – ఆదివారాల్లో మాత్రమే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటా. వారంలో మిగతా రోజులు జై లవకుశ షూటింగ్ లో పాల్గొంటాను. షూటింగ్ షెడ్యూళ్లు ముందే ప్లాన్ చేసినవి. వాటిలో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ షో నాలో ఫన్ యాంగిల్ ను మీకు పరిచయం చేస్తుంది. ఈ షో చేయడానికి నాకు రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారు. కానీ అది మీరు అనుకునేంత కాదు’’ అంటూ ఎన్టీఆర్ ఈ షో విశేషాలు చెప్పాడు.

మరోపక్క ‘‘తాతగారు నందమూరి తారక రామారావు జీవితగాథతో వచ్చే సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాబాయ్ బాలకృష్ణను చూడాలని కోరుకుంటున్నా. ఆ సినిమాలో నేనేదైనా పాత్ర పోషించే ఐడియా ప్రస్తుతానికైతే లేదు. బిగ్ బాస్ షోలో ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉంటాయి. హిందీ బిగ్ బాస్ నేనెప్పుడూ చూడలేదు. మా కజిన్ సిస్టర్ తరచూ చూస్తుంటుంది. తను చెబితేనే ఈ షో గురించి తెలిసింది. ఈ షో కోసం నేను ప్రత్యేకంగా ప్రిపేర్ అయింది ఏమీ లేదు. ఇంట్లో ఉన్నట్టే బిగ్ బాస్ హౌస్ లో ఉంటా. హోస్ట్ గా ఒకరిని అనుకరించనని తనకంటూ ఓ ముద్ర కనిపించేలా చూసుకుంటా’’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఎన్టీఆర్ మాత్రం తన మాటలతో బిగ్ బాస్ షో పై ఆశలను పెంచేస్తున్నాడు మరి.

Check Also

Srikanth is changed as a villain for Balakrishna 102 Movie

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు అందులో హీరోయిజం ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ …

Leave a Reply