Wednesday , November 22 2017

పూజా మరీ ఇంతగా కొల్లగొటేస్తుందా !

పూజా హెగ్డే అనగానే గుర్తుండిపోయే విధంగా డీజే సినిమాలో కనిపించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది ఈ డీజే భామ. తెలుగులో ‘ఒక లైలా కోసం’ అంటూ మొదలు పెట్టి ఆతర్వాత ‘ముకుంద’లో ఎంతో పద్దతిగా కనిపించి ఇప్పుడు డీజే లో రెచ్చిపోయింది ఈ అమ్మడు. అవును పూజా తన లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’లో ఒక్కసారిగా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. దీన్ని బట్టి ఈ సినిమాకు పూజా ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు బికినీలో తన అందాలు ఆరబోస్తూ, మరోవైపు సెక్సీ డ్యాన్సులతో కుర్రకారుల హృదయాల్ని కొల్లగొట్టేసింది. సినిమాకు పెద్ద ప్లస్ గా మారిన పూజా సినిమా విడుదలకు ముందు, తర్వాత కూడా ప్రమోషన్లలో తన వంతు పాత్ర పోషిస్తూ మిగతా హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది.

పూజా మరీ ఇంతగా కొల్లగొటేస్తుందా :

ఈ మధ్య ఏ పెద్ద సినిమా హీరోయిన్ కూడా పూజా స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేదంటే అతిశయోక్తి కాదు. విడుదలకు ముందు ఆడియో వేడుక, రిలీజ్ తర్వాత థ్యాంక్స్ మీట్, మధ్య మధ్యలో ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇలా ‘డీజే’ కోసం చాలా సమయమే వెచ్చించింది పూజా. ఈ కార్యక్రమాలకు వచ్చేటపుడు ఆమె తయారై వస్తున్న తీరు కూడా అందరినీ ఆకర్షిస్తోంది. ఇక్కడితో ఆగకుండా అమెరికాలోనూ ‘డీజే’ను ప్రమోట్ చేయడానికి కూడా వెళ్తోంది. ఇప్పట్లో పూజాను చూసి ప్రస్తుత హీరోయిన్లు ఎంతో నేర్చుకోవాలని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు.

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply