Wednesday , November 22 2017

ఆ పాత్ర చేయనంటున్న ఎన్టీఆర్

అశ్విని దత్ నిర్మాతగా అలనాటి మహా నటి సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందుతున్న చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవిత చరిత్ర అనగానే మనకు మరికొన్ని పాత్రల గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలైపోయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పాత్రలు ఎవరు చేయనున్నారనే డిస్కషన్ హాట్ హాట్ గా నడిచింది. అయితే ఎన్టీఆర్ పాత్రను ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ చేయించేందుకు ఒప్పించారనే రూమర్ కూడా ఉంది. కానీ పెద్దాయన పాత్రలో నటించేందుకు ఎన్టీఆర్ మాత్రం ససేమిరా అనేశాడట.

ఆ పాత్ర చేయనంటున్న ఎన్టీఆర్ :

నిజానికి నిర్మాత అశ్వినీ దత్ తో యంగ్ టైగర్ కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. వీరిద్దరి కంబినేషన్లో కంత్రి, శక్తి వంటి చిత్రాలు కూడా వచ్చాయి. జయాపజాయలతో సంబంధం లేని అనుబంధం వీరిది. అయినా కూడా మహానటి మూవీలో తాత పాత్రలో తాను నటించడం కుదరదని చెప్పేశాడట జూ.ఎన్టీఆర్. ఆ మహానుభావుడిగా కనిపించేందుకు తనకు తగిన స్థాయి లేదని, ఇంకా అంత పరిపక్వత చేకూరలేదని కూడా అన్నాడట. ఇది జస్ట్ కేమియో రోల్ మాత్రమే కావడంతో ఎలాగైనా ఎన్టీఆర్ ని ఒప్పించే పనిలోపడ్డాడు అశ్వినీదత్.

ఒకవేళ చివరి వరకూ జూ.ఎన్టీఆర్ ఈ రోల్ చేసేందుకు ఒప్పుకోకపోతే అప్పుడేం చేయాలనే దానిపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాత పాత్రలో మనవణ్ణి చూడవచ్చనుకుంటున్న నందమూరి అభిమానుల ఆశలు చివరికి ఏమౌతాయో ఏమో ?

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply