Wednesday , November 22 2017

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే చాలు అందులో హీరోయిజం ఎంత పవర్ ఫుల్గా ఉంటుందో విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తారు. నిజానికి విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంత బాగుంటుందనే మాట వాస్తవమే. ఆవిషయానికొస్తే బాలయ్య లెజెండ్ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబు క్రూర విలన్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో టాలీవుడ్ ఫ్యామిలీ హీరో కూడా బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్నాడట. ఎవరా హీరో అనుకుంటున్నారా ?

బాలయ్య సినిమా కోసం విలన్ గా మారనున్న మరో హీరో :

ఇక అసలు విషయానికొస్తే బాలయ్య 102వ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం మాటల దశలో ఉన్నా ఇదే జరిగితే మాత్రం శ్రీకాంత్ పవర్ ఫుల్ విలన్ గా ఎంతగా ఆకర్షిస్తాడో చూడాలి మరి. అయితే శ్రీకాంత్ కు ఆఫర్ చేసిన ఈ రోల్ పవర్ ఫుల్ గా మాత్రమే కాదు, చాలా భయంకరంగా ఉంటుందట. శ్రీకాంత్ కూడా ఇప్పటికే ఈ రోల్ పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ హీరో కాకముందు నెగిటివ్ పాత్రల్లోనే మెప్పించిన శ్రీకాంత్ కు ఇప్పుడు ఈ విలన్ వేషం కొత్తేమి కాదు. ఏదేమైనా బాలయ్య సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా శ్రీకాంత్ ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

Check Also

Rendu Rella Aaru Movie Review

‘రెండు రెళ్ళు ఆరు’ మూవీ రివ్యూ

చిత్రం :  ‘రెండు రెళ్ళు ఆరు’ నటీనటులు : అనిల్ మల్లెల, మహిమ, నరేష్, రవి కాలె, ప్రమోదిని, ఐశ్వర్య,   …

Leave a Reply